చాలా మంది సమయంతో సంబంధం లేకుండా హెడ్ సెట్ వాడుతున్నారు. ఎక్కువ సమయం హెడ్ సెట్ వాడటం వలన వినికిడి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. హెడ్ సెట్ వాడటం వలన చెవులకు తక్కువ ఆక్సిజన్ చేరుతుంది. దీంతో మరిన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ హెడ్ సెట్ నుండి వచ్చే పెద్ద శబ్దాలు నేరుగా చెవిలోకి వెళ్లి కణాలను దెబ్బ తీస్తాయి. అందుకే హెడ్ సెట్ వినియోగం పరిమితంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.