మిస్టర్ కూల్ ధోనీపై మాజీ క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''ధోనీని గాడ్ ఆఫ్ ఝార్ఖండ్ క్రికెట్ అని పిలుచుకుంటాం అని చెప్పాడు. అతను భారత జట్టుకు ఆడటంతో మా రాష్ట్ర జట్టుకు గుర్తింపు వచ్చింది. ధోనీ మా అందరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఎప్పుడూ మద్దతుగా నిలిచేవారు. అతను రాంచీలో ఉన్నాడంటే తప్పకుండా మా ప్రాక్టీస్ సెషన్‌కు వచ్చి సలహాలు ఇచ్చేవారు' అని పేర్కొన్నారు.