బెంగళూరు కేంద్రంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ రికార్డులు నమోదు చేస్తోంది. భారత దేశ విద్యుత్తు వాహనాల మార్కెట్‌లో అగ్రభాగాన కొనసాగుతోంది. ఇటీవలే తమ కంపెనీకి చెందిన పలు మోడళ్లపై రూ.25 వేల వరకు ధర తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆఫర్ సమయంలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో 2024, ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ హై సేల్స్ నమోదు చేసింది ఓలా ఎలక్ట్రిక్. మరోసారి ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో టాప్ టూ వీలర్ తయారీ సంస్థగా నిలిచింది. ఫిబ్రవరి నెలలో ఏకంగా 35 వేల స్కూటర్లు విక్రయించింది. ఈవీ మార్కెట్లో 42 శాతం వాటాను కలిగి ఉంది. నెలవారీ సేల్స్ వి,యంలో చూస్తే ఫిబ్రవరిలోనే అత్యధికంగా సేల్స్ నమోదయ్యాయి. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ వృద్ధి చూసుకుంటే దాదాపు 100 శాతం పెరిగింది.
'మా సేల్స్, రిజిస్ట్రేషన్లలో స్థిరమైన వృద్ధి కొనసాగుతోంది. అది మార్కెట్లో అగ్రభాగానా కొనసాగేందుకు దోహదపడుతోంది. సేల్స్ గ్రోత్ పెరిగేందుకు ప్రధానంగా నాణ్యమైన ఈవీలు కొనుగోలు చేసేందుకు కస్టమర్లు చూస్తుడడంతో పాటు మా ఎస్1 స్కూటర్ కు మంచి డిమాండ్ ఉండడమే. బలమైన ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బెస్ట్ ఇన్ క్లాస్ ప్రొడక్టులతో ముందు ముందు సైతం మార్కెట్లో నాయకత్వం వహిస్తాం.' అని తెలిపారు ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీసీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖందెల్వాల్.
గత మూడు నెలల్లో చూసుకుంటే ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 1 లక్ష రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. అంటే ప్రతి నెలా 30 వేల కంటే ఎక్కువ స్కూటర్లను విక్రయించింది. డిసెంబర్ నెలలో 30 వేల రిజిస్ట్రేషన్లు సాధించిన మొదటి ఈవీ టీవీలర్ తయారీ కంపెనీగా ఓలా రికార్డ్ నమోదు చేసింది. ఓలా పోర్టిఫోలియోలా ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్, ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్, ఓలా ఎస్1 ఎక్స్ 2 కిలోవాట్ హవర్, 3 కిలో వాట్ హవర్, 4 కిలోవాట్ హవర్ వంటి మోడళ్లు ఉన్నాయి. ఇటీవలే ఎస్1 ఎక్స్ 4 కిలోవాట్ హవర్ బండిని లాంచ్ చేసింది. విభిన్న రేంజ్ లతో వినియోగదారులను ఆకర్షిస్తోది. 2024, ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 414 నుంచి 600 సర్వీస్ కేంద్రాలను విస్తరిస్తామని ఓలా తెలిపింది.
రూ.25 వేలు తగ్గింపు..
ఓలా ఎలక్ట్రిక్ గత నెలలో ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25 వేల వరకు ధర తగ్గించింది. దీంతో ఆఫర్ ప్రకటించిన 3 రోజుల్లోనే ఏకంగా 10 వేల స్కూటర్ల సేల్స్ నమోదైనట్లు కంపెనీ తెలిపింది. ఎస్1 స్కూటర్ పోర్ట్ ఫోలియోలో 3 రెట్ల మేర విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. ధర తగ్గింపు తర్వాత ఓలా ఎస్ ప్రో రూ.1,29,999 కే లభిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఓలా ఎస్ 1 ఎయిర్ ధర రూ.1,04,999కు దిగివచ్చినట్లు పేర్కొంది. అలాగే ఓలా ఎస్ 1 ఎక్స్ ప్లస్ రేటు రూ.84,999 గా ఉన్నట్లు పేర్కొంది.