ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది.ఐదు టెస్టుల సిరీస్‌లో భారంగా మార్చి 7 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ చివరి టెస్టు ఆడనుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా అందులోనూ గెలిస్తే పర్సంటేజీ మరింత మెరుగై అగ్రస్థానం నిలబడుతుంది. ఓడితే మళ్లీ మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అయితే ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలవడంతో భారత్ WTC పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.