ఆముదాలవలసలో డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని నాక్ బృందం సభ్యులు డాక్టర్ శ్రీరామ్ కవాలి, రాజలింగం నారాయణ, డాక్టర్ రాకేష్ రావు హామీ ఇచ్చారు. ఆముదాలవలస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండురోజులు పాటు నాక్ బృంద సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాక్ ఎగ్జిట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. ఎన్ఎస్ఎన్ స్వామి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.