తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. గురువారం సాధారణ స్థితిలో ఉన్న భక్తుల తాకిడి శుక్రవారం పెరిగింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో వైకుంఠం కాంప్టెక్స్ వెలుపల ఉన్న క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే గురువారం శ్రీవారిని దర్శించుకోవడానికి 9 గంటల సమయం మాత్రమే పట్టింది.ఈ రోజు భక్తుల తాకిడి పెరిగిపోవడంతో.. ఎక్కువ సమయం పడుతుందని, వారికి తగిని సౌకర్యలాను ఏర్పాటు చేశాని టీటీడీ అధికారులుస్పష్టం చేశారు. కాగా నిన్న శ్రీవారిని 52,643 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,527 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. రూ. 3.73 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.