టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటన శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రారంభం కానుంది. ఈ టూర్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో మొత్తం 4 టీ20ల సిరీస్ ఆడనుంది.భారత్‌కు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. ఆతిథ్య జట్టుకు ఐడాన్ మార్క్రామ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్ నవంబర్ 8న రాత్రి 8:30 గంటలకు (భారతీయ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. అంతకు ముందు 8 గంటలకు టాస్ వేయనున్నారు. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రసారమవుతుంది. అలాగే మొబైల్‌లో Jio యాప్ ద్వారా లైవ్ మ్యాచ్ ను వీక్షించవచ్చు. గతంలో టీమిండియా గత ఏడాది దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అప్పుడు కూడా సూర్యకుమార్ యాదవ్ భారత కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే 3 మ్యాచ్‌ల సిరీస్‌ని భారత్ గెలవలేకపోయింది. సిరీస్ 1-1తో సమమైంది. ఒక మ్యాచ్ రద్దు అయ్యింది. ఈ ఏడాది కెప్టెన్‌గా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లడం సూర్యకు ఇది రెండోసారి. కాబట్టి దక్షిణాఫ్రికాలో భారత్‌కు సిరీస్‌ని గెలిపించే బాధ్యత కెప్టెన్ పైనే ఉంది. కెప్టెన్సీతో సహా యువ ఆటగాళ్ల ను సూర్య ఎలా నడిపిస్తాడన్నదానిపై క్రికెట్ అభిమానులు దృష్టి సారించారు.