మేషం
మీకు అనుకూలమైన సమయం. నూతన ప్రయత్నాలు సిద్ధింప చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలుకు కలిసి వచ్చే సమయం. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మనోరథాన్ని నెరవేర్చుకుంటారు.
వృషభం
మీకు అంత అనుకూలంగా లేదు. ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. గౌరవ మర్యాదలకు మాత్రం ఎలాంటి భంగం వాటిల్లదు. స్త్రీ పరమైన సమస్యలు ఉండను. శ్రమ అధికం. మానసిక ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం. పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
మిథునం
అనుకూల సమయం. కుటుంబసభ్యులతో భేదాభిప్రాయాలు ఏర్పడానికి ఆస్కారం ఎక్కువ. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటకం
కాస్త ఇబ్బందికర సమయం. చెడు వ్యసనాలకు కాస్త దూరంగా ఉండుట మంచిది. దైవ సందర్శనాలు మేలు చేస్తుంది. ఆపనిందలు పడకుండా జాగ్రత్త అవసరం. ధన ప్రాప్తి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
సింహం
మధ్యస్థం నుంచి అనుకూల సమయం ఇది. ధనపరమైన చిక్కులు తొలగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులు కలిసి వస్తాయి. శుభ కార్య ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ప్రయాణంలో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
కన్య
మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వివాహాది కార్యక్రమాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. చికాకులు కలుగుతాయి. కొన్ని విషయాలు ఆనందాన్ని ఇస్తాయి. మిత్రులతో చర్చలు. రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తుల
మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. రాజకీయ నాయకులు నూతన పార్టీల్లో చేరే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం
ఫలితాలు అనుకూలంగా లేవు. స్త్రీ మూలకంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. ఇంట శుభ కార్యాలకు ప్రయత్నాలు జరుగుతాయి. సుఖ శాంతులకు కొరత ఏర్పడుతుంది. కోరికలన్నీ నెరవేరుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
ధనుస్సు
మీకు అనుకూల సమయం. ఉద్యోగ బదీలీలు. ఆర్థికంగా కలిసి వస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. వృత్తి, వ్యాపారముల్లో అనుకూల సమయం. ఆహ్లాదకరంగా గడుపుతారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. దైవ కార్యక్రమాల్లో భాగం అవుతారు.
మకరం
నేటి రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి కలిసి వచ్చే సమయం. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో పదవీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో విజయాలు అందుకుంటారు. ధనప్రాప్తి. విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు.
కుంభం
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కలిసి వచ్చే కాలం. కోపాన్ని తగ్గించుకోండి. విజయాన్ని సాధిస్తారు. ప్రశాంత మనసు కలిగి ఉంటారు.
మీనం
మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అనుకూలించే విషయాలు ఉన్నాయి, ఉత్తమ ఫలితాలు అందుకోవడం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలం. మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa