చాలామంది శనీశ్వరుడికి పూజ చేయాలన్న ఆయన గుడికి వెళ్లాలన్నా కనీసం ఆయన పేరు తలుచుకోవాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శనీశ్వరుడి అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే ఎలాంటి పేదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే.అలాగే ఆయన ఆగ్రహిస్తే ఎలాంటి కోటీశ్వరుడు అయినా బిచ్చగాడు అవ్వాల్సిందే. ఇకపోతే ఆ సంగతి పక్కనే పెడితే శనీశ్వరుడికి పూజ చేసేవారు ఆయనని పూజించేటప్పుడు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఎప్పుడూ కూడా శని దేవుడికి పూజ చేసేటప్పుడు అతని ముందు దీపం వెలిగించకూడదట. ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. దీనికి బదులుగా రావి చెట్టు కింద దీపం పెడితే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయట. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్నట్లయితే పచ్చిమ దిశలో ఉన్న శని దేవుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించాలని చెబుతున్నారు. ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని దేవుడిని ఆరాధించాలట. శని దేవుడి ఆలయానికి వెళ్ళినప్పుడు నేరుగా శని దేవుని కళ్ళలోకి కాకుండా ఆయన పాదాల వైపు చూడాలని చెబుతున్నారు. కళ్ళు మూసుకొని పూజించడం, లేదంటే ప్రార్థించడం చేయాలట.
ఒకవేళ స్వామివారిని చూడాలి అనుకున్న వారు పాదాల వైపు చూసి ప్రార్థించడం మంచిదట. అలాగే శని దేవుడిని పూజించేటప్పుడు ఎరుపు బట్టలు అసలు ధరించకూడదని చెబుతున్నారు. ఎక్కువగా నలుపు లేదా నీలం రంగు బట్టలు మాత్రమే ధరించాలట. శని దేవుడి కోసం నూనెను ఇవ్వాలి అనుకున్న వారు రాగి పాత్రలు అస్సలు ఉపయోగించకూడదట. ఎల్లప్పుడూ ఇనుప పాత్రలను మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు. అలాగే శని దేవుడిని ఆరాధించేటప్పుడు, పూజించేటప్పుడు మాత్రం పశ్చిమానికి ఎదురుగా నిలబడి పూజించాలి. ఎందుకంటే పశ్చిమ దిక్కు కి అధినేత శని దేవుడు.
అలాగే శని దేవుడి పటాన్ని మన దేవుడు గదిలో గాని మన ఇంట్లో గాని ఉంచుకోకూడదు. అలా చేయటం వలన ఇంటిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయట. అలాగే పూజ అయిపోయిన తర్వాత శని దేవుని వైపు వీపు చూపించకుండా అడుగులు వెనక్కి వేస్తూ వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే శని దేవుడికి వీపు చూపిస్తే ఆయన ఆగ్రహానికి తప్పక గురవుతారట. కాబట్టి శని దేవుడికి పూజ చేసేవారు తప్పకుండా ఈ విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.