ట్రెండింగ్
Epaper    English    தமிழ்

75 పైసల వడ్డీకే గోల్డ్ లోన్.. టాప్-5 బ్యాంకుల లిస్ట్ ఇదే

business |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 10:08 PM

ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు బ్యాంకులో వేగంగా లోన్ తీసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ బంగారంపై రుణం. బంగారం ఆభరణాలను లెండర్స్ వద్ద తనఖా పెడుతున్న క్రమంలో ప్రాసెసింగ్ అనేది వేగంగా ఉంటుంది. తక్కువ డాక్యుమెంట్లతో ఈ రుణాలు అందిస్తుంటాయి బ్యాంకులు. ప్రస్తుతం ఈ గోల్డ్ లోన్స్ కి మంచి ఆదరణ లభిస్తుండడంతో బ్యాంకులు సైతం వివిధ రకాల బెనిఫిట్స్ తో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సెక్యూర్డ్ లోన్స్ కాబట్టి వడ్డీ రేట్లు చాలా తక్కువగానే ఉంటాయి. అయితే, బంగారం పై లోన్ తీసుకునే ముందు ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ రేటు ఉందని చూసుకోవడం చాలా మంచింది. అదనపు భారాన్ని తప్పించుకోవచ్చు.


మెడికల్ ఎమర్జెన్సీలు, ఎడ్యుకేషన్ కోసం, బిజినెస్ క్యాపిటల్ వంటి అవసరాలు ఏర్పడినప్పుడు వేగంగా డబ్బులు పొందేందుకు ఈ గోల్డ్ లోన్స్ ని పరిగణనలోకి తీసుకుంటారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తనఖా పెట్టి కావాల్సిన లోన్ తీసుకుంటారు. సంప్రదాయ రుణాల మాదిరిగా ఈ బంగారం లోన్స్ కి క్రెడిట్ స్కోర్ అవసరం ఉండదు. స్వల్ప కాలిక ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఈ లోన్స్ అత్యంత యోగ్యమైన మార్గంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని విషయాలను తెలుసుకోవాలి. లోన్ టూ వాల్యూ రేషియో ఎక్కువ ఉన్న బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ద్వారా మీకు ఎక్కువ లోన్ అమౌంట్ వస్తుంది. అలాగే వడ్డీ రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మరోవైపు.. లోన్ రీపేమెంట్ నిబంధనలు చూసుకోవాలి. మీకు అనువైన విధంగా లోన్ రీపేమెంట్స్ ఆప్షన్ ఎంచుకునే వీలు కల్పించే బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వాలి.


9 శాతం (75 పైసలు) కన్నా తక్కువ వడ్డీ..


9 శాతం కన్నా తక్కువ వడ్డీకే పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు బంగారం రుణాలు అందిస్తున్నాయి. అలాగే ఈఎంఐ ఆప్షన్ సైతం అందిస్తున్నాయి. ఇప్పుడు రూ. 5 లక్షల గోల్డ్ లోన్ పై 2 ఏళ్ల టెన్యూర్ కి వడ్డీ రేటు, ఈఎంఐ ఎంత ఉంటుందని అనేది తెలుసుకుందాం.


సెంట్రల్ బ్యాంక్ లో బంగారం రుణాలపై వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. రూ.5 లక్షలకు రెండేళ్ల టెన్యూర్ పై ఈఎంఐ రూ.22,739 పడుతుంది.


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.85 శాతంగా ఉంది. రూ.5 లక్షలకు ఈఎంఐ రూ.22,807 పడుతుంది.


ఫెడరల్ బ్యాంకులో బంగారం రుణాలపై వడ్డీ రేటు 8.99 శాతంగా ఉంది.


బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 8.80 శాతంగా ఉంది.


ఇండియన్ బ్యాంకులో బంగారం రుణాలపై వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంగారం రుణాలపై వడ్డీ రేటు 9.15 శాతం నుంచి మొదలవుతోంది.


పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంది.


పంజాబ్ నేషనల్ బ్యాంకులోనూ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 9.25 శాతంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com