బాదం పప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..సూపర్ ఫుడ్‌గా పిలవబడే బాదంలో న్యూట్రీషియన్స్, విటమిన్స్, ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి. బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది.