సారవంతమైన బంకమన్ను నేలలతో పాటు నిస్సారమైన నేలలోనూ తులసిని సాగు చేయొచ్చు. తులసి ఆకులను ఎక్కువగా ఉత్పత్తి చేయాలంటే నీరు ఎక్కువగా ఉండే నేలల్లో సాగు చేయడం మంచిది. తులసి సాగు ఏడాది పొడవునా చేయవచ్చు. నాటిన తేదీ నుండి 90 రోజుల తర్వాత తులసిని మొదటిసారిగా కోయవచ్చు. ఆ తర్వాత మూడు నెలలకు ఒకసారి పంటను సేకరించవచ్చు. రైతులు తులసిని ఆయుర్వేద ఉత్పత్తుల కంపెనీలకు విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు.