అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 73,923 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకొని 22,414 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌లో ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టైటన్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.