చాలా మందికి బరువు పెరగడం, తగ్గడం వంటివి చాలా కష్టంతో కూడుకున్న పని. వయసు, ఎత్తుకు తగ్గ బరువు లేకున్నా వాళ్లు అనారోగ్యంగానే ఉన్నట్టు లెక్క. అలాంటి వారు సరిపడా బరువు పెరగాలంటే ఈ ఫుడ్ తింటే మంచి ఫలితాలు వస్తాయి. బరువు పెరగడం అంటే ఎకాఎకిన కేలరీలతో కూడిన ఆహారాన్ని తిని.. ఒళ్లు పెంచుకోవడం కాదు. బరువు పెరిగే ప్రక్రియ కూడా ఒక పద్దతి ప్రకారం ఉండాలి. కండరాల శక్తిని పెంచుకుంటూ బరువు పెరిగితేనే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అలా చేయడానికి బెస్ట్ ఫుడ్స్ ఇవే.
అరటి పండ్లు: చాలా మంది తక్షణ శక్తినివ్వడం కోసం అరటి పండ్లను తింటారు. కానీ ఇందులో ఉండే పోషకాల కారణంగా వీటిని ఎప్పుడు తిన్నా ఉపయోగం ఉంటుంది. బరువు నియంత్రణలోనూ.. బరువు పెరగడంలోనూ.. కండరాలను పెంచడంలోనూ ఇది తోడ్పడుతుంది.
రెడ్ మీట్: బరువు, కండరాలు పెంచుకోవాలనుకునేవాళ్లు రెడ్ మీట్ తినడం ఉత్తమమని అధ్యయనవేత్తలు అంటున్నారు. మటన్ లో ప్రోటిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కండరాల శక్తిని పెంచుతుంది.
చికెన్: చికెన్ లో ఉండే ప్రోటీన్ల కారణంగా మంచి కేలరీలను అందిస్తుంది. చెడు కేలరీలు ఇందులో తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు పెరగాలనుకునేవాళ్లు చికెన్ తినడం ఉత్తమం.
నట్స్: నట్స్ లో పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అల్పాహారంగా గానీ భోజనంలో గానీ నట్స్ ను తీసుకుంటే తద్వారా మంచి ఫలితాలు కనబడతాయి. కండరాల శక్తికి ఇదదే బెస్ట్ ఫుడ్.
హోల్ గ్రెయిన్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. చేపలలో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెరగడానికే కాకుండా కండరాల శక్తిని పెంచుతాయి. బంగాళదుంపలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. చక్కెర నిల్వలు కూడా సరిపోను ఉంటాయి. ఇవి బరువు పెరగడంలో ఎంతగానో దోహదం చేస్తాయి.