దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇకపై రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విడిపోనుంది. ఈ మేరకు టాటా మోటార్స్‌ను విభజించే ప్రతిపాదనకు సోమవారం బోర్డు ఆమోదం తెలిపింది.
వాణిజ్య వాహనాల వ్యాపారం, దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థగా, ప్రయాణికుల వాహనాల వ్యాపారాలు, ఈవీలు (విద్యుత్ వాహనాలు), జేఎల్ఆర్, దాని సంబంధిత పెట్టుబడులు మరొక సంస్థగా విడదీయాలనుకుంటున్నట్లు ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ సమాచారమిచ్చింది.