టీమిండియా క్రికెటర్ షాబాజ్ నదీమ్ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు మరియు ప్రపంచవ్యాప్తంగా టి 20 లీగ్‌లు ఆడాలని యోచిస్తున్నట్లు చెప్పాడు. రిటైర్మెంట్ గురించి చాలా కాలంగా ఆలోచిస్తున్నానని, ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని వివరించాడు. స్పిన్నర్ షాబాజ్ నదీమ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుంచి రిటైరయ్యాడు. నదీమ్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 542 వికెట్లు తీశాడు. భారత్ తరఫున రెండు టెస్టులు ఆడాడు. అతను 2019లో 30 ఏళ్ల వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
భారత జట్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో జార్ఖండ్ స్పిన్నర్ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో రాంచీ టెస్టు సందర్భంగా షాబాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులిచ్చి 2 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ, అజింక్యా రహానే సెంచరీతో భారత్ ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. నదీమ్ తన రెండో టెస్టు మ్యాచ్ ఆడేందుకు మరో రెండేళ్లు పట్టింది. 2021లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో షాబాజ్ నదీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లు బౌలింగ్ చేసి 167 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.