ధర్మశాలలో జరుగుతున్న ఫైనల్ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. మధ్యాహ్న భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రాలే 61 ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. బెన్ డకెట్ 27, ఒల్లీ పోప్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ రెండు వికెట్లు భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తీసుకున్నాడు.
ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్ పాటిదార్ స్ధానంలో పడిక్కల్‌కు చోటు దక్కింది. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆకాష్ దీప్ ప్లేస్‌లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు.