మెడలో రుద్రాక్ష ధరించిన శివ భక్తులను మనం తప్పక చూసి ఉంటాం. అయితే 108 పూసలతో రుద్రాక్షను ధరించడం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రుద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. రుద్రాక్ష ధరించడం వల్ల గుండె వేగం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుంది. గుండెపోటు, అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది.
చాలా మంది హిందువులు రుద్రాక్షను ధరిస్తూ ఉంటారు. శివుడి కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని ప్రతీతి. రుద్రాక్షలు ఒక ముఖి నుండి 21 ముఖి వరకు కనిపిస్తాయి. వీటిని ధరిస్తే అన్నిరకాల కష్టాల నుండి బయటపడతారని నమ్ముతారు. అంతేకాదు జాతకంలో గ్రహాల స్థానం కూడా బలపడుతుందని వేదపండితులు చెబుతుంటారు. రుద్రాక్షను శ్మశాన వాటికకు తీసుకెళ్లకూడదట. నవజాత శిశువు పుట్టినప్పుడు ధరించకూడదని చెబుతుంటారు.