కాకరకాయలో విటమిన్లు, ఐరన్, జింక్, పొటాషియం, కొవ్వు, పీచు, పిండిపదార్థం అధికంగా ఉంటాయి. కాకరకాయ రసం బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. కాకరకాయ తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ వృద్ధి చెందుతుంది. పేగుల్లో చేరిన మలినాలు తొలగుతాయి. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. మూత్రపిండాల్లో ఉన్న ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలు తొలగుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్ కళ్లకు మంచిది.