ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ భారత ఎయిర్టెల్ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రూ.118, రూ.289గా ఉన్న ప్లాన్ల ధరలు వరుసగా రూ.129, రూ.329కి పెరిగాయి. ఈ మేరకు వెబ్సైట్, మొబైల్ యాప్‌లలో తగు మార్పులు చేశారు.