టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. గత రెండు నెలల్లో ఆయన వ్యక్తిగత సంపద భారీగా తగ్గిపోయింది. సుమారు రూ.3 లక్షల కోట్ల పై చిలుకు ఆవిరైంది.
దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్ మూడో స్థానానికి పడిపోయారని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ప్రస్తుతం ఎలన్ మస్క్ నికర వ్యక్తిగత సంపద 189 బిలియన్ డాలర్లు. బెర్నార్డ్ అర్నాల్ట్ 201 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో, జెఫ్ బెజోస్ 198 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.