మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
ఈ నెల 18 నుంచి 23 వరకు వరుసగా సెలవులు ఉంటాయని వెల్లడించింది. సెలవులకు బదులుగా ఈ నెల 24, 31, ఏప్రిల్ 7, 13, 14, 21 తేదీల్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల కోసం 3,473 సెంటర్లు ఏర్పాటు చేశారు.