కర్భూజ పండు తినడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ పండులో 92 శాతం నీరు ఉంటుంది. పండుగా తిన్నా, పండ్ల రసంగా తాగిన ఒకేరకమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. కర్భూజలో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధకశక్తిని, కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఇది రుచికి తియ్యగా ఉన్నప్పటికీ ఇందులో కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి. లవణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వేసవికాలంలో దీనిని తరచూ తీసుకుంటే శరీరానికి నీరసం అనేది రాదు.