గుప్పెడు కిస్మిస్‌లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఎన్నో లాభాలున్నాయి. రక్తం శుభ్రపడడమే కాకుండా నరాలకు బలం చేకూరుతుంది. అదేవిధంగా మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. సంతానం లేని మహిళలు నానబెట్టిన కిస్మిస్‌లను తింటే అండాశయంలోని లోపాలు తొలగి సంతానం కలుగుతుంది. చిన్నపిల్లలకు రోజూ కిస్మిస్‌లను తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. వారు చదువుల్లో చురుగ్గా ఉంటారు.
ఉల్లిపాయ రసంతో ఒత్తైన జుట్టు
ఉల్లిపాయ రసాన్ని బాల్డ్ ప్యాచెస్, థిన్ హెయిర్ ఉన్నట్లైతే ఆ ప్రాంతంలో గ్యాప్ లేకుండా రాయాలి. తరువాత గంటసేపు ఉంచి నీటితో లేదా మైల్డ్ షాంపూతో కడగాలి. అయితే ఉల్లిపాయ రసం ఉపయోగించిన తర్వాత కెమికల్స్ అధికంగా ఉండే షాంపూను ఉపయోగించకుండా, మైల్డ్ లేదా హెర్బల్ షాంపూను ఉపయోగిస్తే మంచిది. ఇలా తరచుగా చేయడం వలన జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.