చాలామంది అలసిపోయినప్పుడు దాహం వేసినప్పుడే నీళ్లు తాగుతారు. మిగిలిన సమయంలో శరీరానికి నీరు అవసరం లేదా? దాహం వేయకపోయినా నిర్ణీత వ్యవధిలో నీరు తాగడం అలవాటు చేసుకోవాలి.
ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువ మోతాదులో నీటిని శరీరానికి అందించకపోతే అనేక రోగాల బారిన పడతారు. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. అందుకే రోజూ కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. ఇది మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి శారీరక శ్రమలలో పాల్గొనడానికి సహాయపడుతుంది