గుప్పెడు కిస్మిస్‌లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే బోలెడు లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రక్తం శుభ్రపడడమే కాకుండా నరాలకు బలం చేకూరుతుందని పేర్కొంటున్నారు. అదేవిధంగా మలబద్దకం సమస్య ఉండదు. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. చిన్నపిల్లలకు రోజూ కిస్మిస్‌లను తినిపిస్తే ఎదుగుదల బాగుంటుంది. అయితే వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కిస్మిస్ లకు దూరంగా ఉండాలి.