ప్రముఖ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ పలు అంతర్గత విభాగాలను మూసివేస్తోంది. ఇప్పటికే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టును నిలిపేయగా, తాజాగా స్మార్ట్ వాచ్ డిస్ప్లే రూపకల్పన-అభివృద్ధి ప్రాజెక్టును కూడా ఆపేసినట్లు సమాచారం.
ఖర్చు ఎక్కువ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పలు దేశాల్లోని తమ శాఖల్లో ఉన్న ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం పడనుంది.