వాహన తయారీలోకి ప్రవేశించిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల సంస్థ షావోమి గురువారం నుంచి తమ తొలి కారు స్పీడ్ అల్ట్రా 7 మోడల్‌కు ఆర్డర్లు స్వీకరించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ లీ జున్ కీలక విషయాలు వెల్లడించారు. ఆకర్షణీయ లుక్, డ్రైవ్ చేయడానికి సులభంగా ఉండే స్మార్ట్ కారును తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ఈ కారు ధర రూ.58 లక్షలు ఉండొచ్చు.
అలాగే స్కోడా కొడియాక్ ఎల్ అండ్ కే వేరియంట్ ధరను ఏకంగా రూ .2 లక్షలు తగ్గించారు. ఈ తగ్గింపు అనంతరం ఈ లగ్జరీ కారు ధర రూ .39.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) తగ్గింది. ప్రస్తుతం స్కోడా కొడియాక్ లో ఎల్ అండ్ కే వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, ఈ రూ. 2 లక్షల డిస్కౌంట్ అనంతరం, సౌకర్యవంతమైన, విలాసవంతమైన స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని ఇంటికి తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా కనిపిస్తోంది.