ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు పాక్ జట్టుకు బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్‌గా చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత టీ20 కెప్టెన్ షహీన్ షా అఫ్రిది నాయకత్వంపై పాక్ బోర్డు పెద్దలు సంతృప్తిగా లేరు. దీంతో వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో బాబర్ ఆజంకు కెప్టెన్సీ తిరిగి అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.