ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. మే మొదటి వారంలో 10వ తరగతి ఫలితాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1న ప్రారంభమై ఏప్రిల్ 8 నాటికి పూర్తవుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారు.
ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు. రెగ్యులర్, లక్ష మంది ప్రైవేట్ పరీక్షలు 6.23 లక్షల మంది రాశారని... 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో మే మొదటి వారంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షలు పూర్తయిన సంగతి తెలిసిందే.