ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే.. చూసుకోండి

business |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 10:12 PM

ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యాపారస్తులు తప్పనిసరిగా ప్రతి ఏటా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి జులై 31 వరకు ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌కు అవకాశం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సర్ 2024-25లో అప్పడు నెల రోజులు గడిచిపోయాయి. ఏప్రిల్ 1 నుంచే ఐటీ రిటర్న్స్ కు సంబంధించిన అన్ని ఫామ్స్‌ను నోటిఫై చేసింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు


తొలి రోజు నుంచే రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ముప్పై రోజుల్లో 6 లక్షలకుపైగా రిటర్న్స్ ఫైల్ చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. మరి మీరు కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగా అందుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏవో తెలుసుకోండి. వాటిని అందుబాటులో పెట్టుకుని రిటర్నులు దాఖలు చేయడం ప్రారంభించండి. ఆ పత్రాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పాన్ కార్డు: ఆదాయపు రిట్నులు దాఖలు చేయడానికి కచ్చితంగా పాన్ కార్డు అవసరం. మీ ఆర్థిక లావాదేవీలన్నీ దీనితోనే ముడి పడి ఉంటాయని గుర్తుంచుకోవాలి. పాన్ కార్డు లేకుండా రిటర్న్స్ దాఖలు చేయలేరు.


ఆధార్ కార్డు: మీ గుర్తింపును తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆధార్ కార్డును ఉపయోగిస్తుంది. మీ ఆధార్ కార్డుకు తప్పనిసరిగా ఫోన్ నంబర్ లింకై ఉండాలి.


శాలరీ స్లిప్స్: ఉద్యోగులు నెలవారీ జీత భత్యాలు, హెచ్ఆర్ఏ వంటి అంశాలు తెలుసుకునేందుకు శాలరీ స్లిప్స్ అవసరమవుతాయి.


ఫామ్ 16: ఉద్యోగి పని పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం ఫామ్ 16 జారీ చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన జీతం, శాలరీ నుంచి మినహాయించిన టీడీఎస్ వివరాలు ఈ ఫామ్ 16లో ఉంటాయి. ఉద్యోగులు తప్పనిసరిగా ఫామ్ 16 అందిన తర్వాతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


ఫామ్ 26ఏఎస్: ఈ ఫారాన్ని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. దీంట్లో టీడీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, రిఫండ్స్ సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.


బ్యాంక్ స్టేట్‌మెంట్: కొన్నిసార్లు టీడీఎస్ చెల్లింపుల వివరాలు లభించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో బ్యాంక్ స్టేట్‌మెంట్లలో ఆ వివరాలు లభిస్తాయి. బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివరాలూ సిద్ధంగా ఉంచుకోవాలి. రిఫండ్లు ఈ బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతాయి.


ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్: జీవిత బీమా, ఆరోగ్య బీమా, హోమ్ లోన్, ట్యూషన్ ఫీజు, వివరాళాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పాస్ బుక్, మ్యూచువల్ ఫండ్ ఖాతా స్టేట్‌మెంట్లు లాంటి ట్రాన్సాక్షన్లు రుజువు చేసే రసీదులను ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్స్ గా చూపించొచ్చు.


క్యాపిటల్ గెయిన్స్: స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి వాటిని అమ్మితే వచ్చిన లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. నష్టపోతే సంబంధిత వివరాలు కూడా చూపించాలి.


విదేశీ ఆదాయం: విదేశాల నుంచి ఆదాయం వస్తున్నట్లయితే దానికి సంబంధించిన వివరాలను పొందుపరచాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com