వెంకటగిరిలో జరిగిన సౌత్ జోన్ వన్ డే బాలికల క్రికెట్ ఛాంపియన్షిప్ టైటిల్ను అనంతపురం జిల్లా అండర్-19 బాలికల క్రికెట్ జట్టు గురువారం కైవసం చేసుకుంది. అనంతపురం జట్టు 14 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సౌత్ జోన్ ఛాంపియన్గా నిలిచిన అనంతపురం జట్టును జిల్లా క్రికెట్ సంఘం కార్య దర్శి మధు ఆచారి, కోచ్ ఆర్. కుమార్ అభినందించారు.