జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నారాయణపేట పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీనీ ఆర్డీవో కార్యాలయం వద్ద డిప్యూటీ జిల్లా వైద్య శాఖ అధికారి శైలజ జండా ఊపి ప్రారంభించారు. పాత బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు వున్న చిన్నారులకు నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేయాలని అన్నారు.