అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లాస్ వెగాస్‌కు సమీపంలో సోమవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల్లో నలుగురు మహిళలు.. ఒక పురుషుడు మృత్యువాతపడ్డారు. ఓ 13 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. 57 ఏళ్ల ఎరిక్ ఆడమ్స్ అనే నిందితుడు ఈ కాల్పులకు పాల్పడ్డాడని నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తించారు. అయితే కాల్పుల అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa