జీర్ణశక్తి పెరుగుదలకు అల్లం ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది. ఇక మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుట్టు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ ఇది బాగా సాయమవుతుంది. ఒక కప్పు నీటిలో ఒక మందారం పువ్వు చొప్పున వేసి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది.