పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గురువారం బ్యాడ్ డే అనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా వరుసగా బ్యాడ్ న్యూస్ లు పారిస్ నుంచి భారత్ కు టెలీకాస్ట్ అయ్యాయి. ప్రధానంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇద్దరు తెలుగు తేజాలు అడియాశలు చేసిన పరిస్థితి. కచ్చితంగా ఈ సారి ఏదో ఒక పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్న వేళ అవి గురువారం పారిస్ వేదికగా కూలిపోయాయి. సింధు పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈసారి పారిస్ నుంచి కూడా ఏదో ఓ పతకం ఢిల్లీకి చేరడం ఖాయమనే కామెంట్లు వినిపించాయి. అయితే... ఆ ఆశలన్నీ గురువారం ఆవిరైపోయాయి. క్వార్టర్స్ కి కూడా చేరకుండానే పీవీ సింధు ఇంటిముఖం పట్టింది. చైనా అమ్మాయి హే బిన్ జియావో చేతిలో సింధు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో ఆరంభంలో ఏకంగా 1-5తో వెనుకబడ్డ సింధు బ్రేక్ టైం కి 10-11 వద్ద ఉంది. అయితే... ఆ తర్వాత సింధుకు హే బిన్ జియావో ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.. పుంజుకునే పరిస్థితి కల్పించలేదు దీంతో... 19-21, 14-21 తో చైనా అమ్మాయి చేతిలో సింధు పరాయజం పాలైంది.