టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇటివల టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకున్న రోహిత్ ఇప్పుడు వన్డేల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. శుక్రవారం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ మరో అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చేయని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ నంబర్ 1 కెప్టెన్‌గా హిట్‌మన్ నిలిచాడు. శ్రీలంకపై 3 సిక్సర్లు కొట్టి రోహిత్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ విషయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా 234 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ పేరిట 231 సిక్సర్లు ఉన్నాయి. మూడు సిక్సర్లు బాది మోర్గాన్‌ను బీట్ చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 211 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.