కొలొంబో వేదికగా శ్రీలంక, భారత్ జరిగిన తొలి వన్డే మ్యాచ్ టై అయింది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఇందులో నిశాంక(56), దునీత్(67) హాఫ్ సెంచరీలు చేశారు. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా..సిరాజ్, దుబే, కుల్దీప్, సుందర్ లు తలో వికెట్ పడగొట్టారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణయం ఆ జట్టుకు బిగ్ షాకిచ్చిందనే చెప్పాలి. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసుకోవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. అయితే, పాతుమ్ నిస్సంక (56 పరుగులు), లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ దునిత్ వెల్లలాగే అజేయంగా 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో శ్రీలంక జట్టు గౌరవప్రదమైన స్కోరును అందుకోగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. "భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా..సిరాజ్, దుబే, కుల్దీప్, సుందర్ లు తలో వికెట్ తీసుకున్నారు.
231 లక్ష్యఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(58) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్(33), కేఎల్ రాహుల్(31), శివమ్ దూబె(25), కోహ్లి (24), అయ్యర్(23) పరుగులు చేశారు. దీంతో 230 పరుగులు చేసి స్కోరు సమం చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 44వ టై మ్యాచ్ కావడం విశేషం. " శ్రీలంక బౌలర్లలో చరిత్ అసలంక, హసరంగ 3 వికెట్లు తీయగా..వెల్లలాగే 2 వికెట్లు, ధనుంజయ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.