శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. టాస్ గెలిచినా శ్రీలంక మొదట బాటింగ్ ఎంచుకోగా. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40), దునిత్ వెల్లలాగే(39) పరుగులు చేశారు.. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన 42.2 ఓవర్లలో కేవలం 208 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(64), అక్షర్ పటేల్(44), శుభ్‌మన్ గిల్(35) రాణించారు. కోహ్లీ(14), దూబే(0), కేఎల్ రాహుల్(0), అయ్యర్(07) సహా కీలకమైన బ్యాటర్లంతా నిరాశపరిచారు. దీంతో లంక బౌలర్స్ భారత బ్యాటర్లపై పైచేయి సాధించారు. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో శ్రీలంక ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి, లంక విజయానికి ఒక్కడే కారణం. అతనే.. జెఫ్రీ వాండర్సే. వికెట్ నష్టపోకుండా 97 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత జట్టును వాండర్సే తన మణికట్టు మాయతో ఓటమి చెంతకు చేర్చాడు. స్పిన్, వైవిధ్యమైన బౌన్స్‌తో ప్రపంచకప్ వీరులకు చుక్కలు చూపించాడు. ఏకంగా 7 వికెట్లు సాధించి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు వాండర్సే. అతనికి సహాయంగా లంక కెప్టెన్ చరిత అసలంక 3 వికెట్లు పడగొట్టి తాను ఎంత విలువైన బౌలరో నిరూపించాడు.