టెల్కోలు భారీగా టారిఫ్లను పెంచడంతో 27.5 లక్షల మంది ఖాతాదారులు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను ఇటీవల కాలంలో ఎంచుకుంటున్నారు. జులై తొలి వారంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ ఖాతాదారులపై ఏకంగా 25 శాతం మేర చార్జీలను పెంచాయి. భారం పెరగడంతో చౌక ధరల్లో మెరుగైన ప్లాన్లను అందిస్తున్న ప్రభుత్వ టెల్కో బిఎస్ఎన్ఎల్కు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ పెట్టుకుంటున్నారు.