ప్రస్తుత రోజుల్లో చెల్లింపులన్నీ ఆన్ లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ యాప్స్ వాడకం బాగా పెరిగిపోయింది. కాగా, ఆన్ లైన్ యూజర్స్ కోసం ఆర్బీఐ మరో సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇకపై గూగుల్ పే, ఫోన్‌లో రోజుకు 5 లక్షల వరకు ట్రాన్స్ ఫర్ చేసుకునే వెసులుబా టు కల్పించింది. మొదట్లో ఈ లిమిట్ కేవలం రూ50 వేలు ఉండేది. ఆ తర్వాత లక్షకు పెంచారు. కాగా.. రోజురోజుకు ఆన్ లైన్ చెల్లింపులు పెరిగిపోవడం చిన్నా చితకా చెల్లింపులు కూడా ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటితో జరుగుతుండటంతో ఆర్బీఐ రోజూవారి లావాదేవీల పరిమితిని పెంచింది. తాజా రూల్స్ ప్రకారం 24 గంటల్లో రూ.5 లక్షల వరకు ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.