స్మార్ట్‌ఫోన్లు నిత్య జీవితంలో కీలకంగా మారాయి. వీటి చార్జింగ్ అయిపోతే.. దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి వారి కోసం చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ‘రియల్‌మీ’ సరికొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. కేవలం 5 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 శాతం చార్జింగ్ అయ్యేలా చేసే కొత్త టెక్నాలజీని సిద్ధం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఫాస్ట్ చార్జింగ్‌లో రికార్డ్ బ్రేక్ చేయబోతున్నాం’ అంటూ ‘ఎక్స్’ వేదికగా కంపెనీ పేర్కొంది.