కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 6 మార్గాలను సూచించింది. ఆరోగ్యవంతమైన జీవనం కోసం "క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, ఉప్పు వాడకాన్ని పరిమితుల్లో ఉంచుకోవాలి, ధూమపానం మానేయాలి, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకుంటూ ఉండాలి, వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి" అని ఆరోగ్య శాఖ తెలిపింది.