ధూమపానం మానేసిన మొదటి వారాల్లో హృదయ స్పందన రేటు తగ్గుతుందని, రక్తపోటు సాధారణ స్థితికి వస్తుందని ఎటర్నల్ హార్ట్ కేర్ సెంటర్ & రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ గుప్తా తెలిపారు. "8 గంటల తర్వాత రక్తంలో నికోటిన్ & కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం తగ్గుతుంది. 1-2 రోజుల తర్వాత తల తిరగడం, అలసట, కొన్ని సందర్భాల్లో తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. కానీ క్రమంగా పరిస్థితి సాధారణ స్థితికి వస్తుంది" అని పేర్కొన్నారు.