యాపిల్‌ను చాలామంది తొక్క తీసి తింటుంటారు. అలా తినకూడదని, యాపిల్ తొక్కతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాపిల్ పండ్లను తొక్కతో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె జబ్బుల నుంచి కాపాడుతుందని సూచిస్తున్నారు.