ఏజీఐ రోబోలు వస్తే, మానవుల ఉద్యోగాలపై, వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఏజీఐ మానవ విలువలను కలిగి ఉంటుందని, సమాజ శ్రేయస్సు, అభివృద్ధికి పాటుపడుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవాళి గోప్యత, భద్రతకు ముప్పు ఉండకూడదంటే, బలమైన భద్రతా ప్రమాణాలతో ఏజీఐను రూపొందించాలని, ఏజీఐపై మానవ పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని సూచిస్తున్నారు.