చాలామంది పచ్చళ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. కూరలు ఉన్నప్పటికీ పచ్చళ్లని ఎక్కువగా పెట్టుకుని భోజనం చేస్తారు. నిల్వ పచ్చళ్లు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పచ్చళ్లు తినేవారిలో కడుపులో మంట, ఎసిడిటీ సమస్య వస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి రక్తపోటును పెంచి, గుండె సమస్యలకు కారణం అవుతాయని సూచిస్తున్నారు.