స్వీట్ కార్న్ చాలా వేగంగా ప్రజలలోకి చొచ్చుకొచ్చిన ఆహారం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో ఉన్న తీపి రుచి దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు.వీధుల్లో చాలా వరకు ఉడికించిన స్వీట్ కార్న్ మాత్రమే కాకుండా చీజ్ స్వీట్ కార్న్, బటర్ స్వీట్ కార్న్, మసాలా స్వీట్ కార్న్ అని చాలా రకాలుగా అమ్ముతుంటారు. స్వీట్ కార్న్ ఆరోగ్యకరమైన చిరుతిండిగా పరిగణించబడుతుంది. దీన్ని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో.. స్వీట్ కార్న్ గురించి చాలా మందికి తెలియని నిజాలేంటో తెలుసుకుంటే..
ఎనర్జీ..
మొక్కజొన్నలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి అందించడంలో గొప్పగా సహాయపడుతుంది.
జీర్ణక్రియ..
మొక్కజొన్నలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది పేగుల కదలికలను సులభతరం చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఊబకాయం..
అధిక బరువు ఉన్నవారు ఆహారంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వీట్ కార్న్ లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, కేలరీలు కూడా తక్కువ ఉంటాయి. స్వీట్ కార్న్ తింటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.