హీరో గ్లామర్ 2024 బైక్‌ను రామ్ చరణ్ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో లాంచ్ చేశారు. స్పోర్టీ ఫెయిరింగ్, ఎల్ఈడీ హెడ్లైట్లు, టెయిల్‌లైట్ వల్ల ఇది మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని హీరో తెలిపింది. దీనికి 12 5సీసీ సింగిల్- సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. డిజిటల్ ఇన్స్ట్రమెంట్ క్లస్టర్, యూఎన్‌బీ చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటో తన హీరో గ్లామర్ 2024ను సరికొత్త రంగులో తెచ్చినట్లు వెల్లడించింది. బ్లాక్ మెటాలిక్ సిల్వర్లోని ఈ బైకును హీరో రామ్ చరణ్‌తో కలిసి హీరో మోటో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాంజివ్విట్ సింగ్ ఆవిష్కరించారని తెలిపింది. హీరో గ్లామర్ 2024 డ్రమ్ వేరియంట్ ధర రూ. 83,598 కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ. 87,598 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది.