టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్‌ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. శనివారం ఉదయం ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇంటర్నేషనల్‌తోపాటు దేశవాళీ ఆటకు ఇకపై దూరంగా ఉండనున్నాడు. టీమిండియా లెఫ్ట్‌హ్యాండ్ ప్లేయర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాడు. 38 ఏళ్ల ధావన్.. రెండేళ్ల నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. 2022లో బంగ్లాదేశ్ టూర్ తర్వాత మళ్లీ ఆడలేదు. ఇండియా జట్టు నుంచి ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఈ సమయంలో ఆటకు గుడ్ బై చెప్పడమే మంచిదని భావించాడు. అందుకు సంబంధించిన వీడియోను పోస్టు చేశాడు. దేశం తరపున ఆడినందుకు చాలా గర్వంగా ఉందన్నాడు శిఖర్. తన 14 ఏళ్ల జర్నీలో తనకు ఎంతోమంది సాయం చేశారని, అందువల్లే ఈ స్థాయికి తాను వచ్చానని గుర్తుచేశాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపాడు. చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా, మదన్‌శర్మ ఆధ్వర్యంలో క్రికెట్ నేర్చుకున్నానని తెలిపాడు.
శిఖర్‌ధావన్ 14 ఏళ్ల కిందట టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. 2010లో వన్డేల ద్వారా అరంగేట్రం చేశాడు. 167 మ్యాచ్‌లు ఆడిన శిఖర్.. 17 సెంచరీలతో 6793 పరుగులు చేశాడు. 2013లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు ఆడాడు ధావన్. అరంగేట్రంలోనే సెంచరీ చేశాడు. భారత్ తరఫున 33 టెస్టు మ్యాచ్‌లు ఆడి 2315 పరుగులు చేశాడు. టీ20 మ్యాచ్‌ల్లో 1759 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మాత్రం 6788 పరుగులు చేసి మాంచి ఊపుమీదున్నాడు. ప్రస్తుతం పంజాబ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ జట్టులోకి రావడంతో ధావన్ స్పీడ్ తగ్గింది. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మతో కలిసి అద్భుతమైన పార్టనర్ షిప్ అందించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా రాణించిన జోడిల్లో రోహిత్-శిఖర్ నాలుగోవారు. అంతకుముందు గంగూలీ-సచిన్ జోడి వుంది.